తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని.. భాజపా అభ్యర్థి రత్నప్రభ పిటిషన్ వేశారు. డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టాలని రత్నప్రభ తరఫు న్యాయవాది కోరారు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి కోర్టు ఆదేశించింది.
ఉపఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ వేశామని తెదేపా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్లను కలిపి విచారించాలని తెదేపా తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. రిజిస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పషం చేసింది.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు