ETV Bharat / state

అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు...రూ.9 లక్షలు స్వాధీనం - చిత్తూరు జిల్లా వార్తలు

నకిలీ బంగారు ఆభరణాలతో మోసాలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Interstate gang arrest
అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు
author img

By

Published : Oct 10, 2020, 11:54 AM IST

నకిలీ బంగారు ఆభరణాల పేరుతో మోసాలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేశారు.

Interstate gang arrest
అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు

వివరాల్లోకి వెళితే...

పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ కథనం మేరకు...కేరళకు చెందిన రాధిక అలియాస్ తులసి ఈ ఏడాది జనవరిలో గుంటూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​లో అశోక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి రూ. 50 లక్షల విలువచేసే బంగారం రూ.25 లక్షలకే ఇస్తామని అమాయకులను మోసగించేవారు. ఈ తరుణంలో చెన్నైకి చెందిన స్టెల్లా అలియాస్ సోడి, చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన యుగంధర్, చిన్నబాబులతో వీరు జతకట్టారు. ఈ ముఠా సభ్యులు అశోక్ ద్వారా గుంటూరు ఎయిర్టెల్ ప్రైవేట్ టెలికాం సంస్థలో పనిచేసే ఉదయ్ కుమార్, రియాజ్​తో పరిచయం ఏర్పడింది.. వీరితో బేరం కుదుర్చుకుని బంగారం ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి పీలేరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మార్చి 7వ తేదీన ఈ ముఠా సభ్యులు, బంగారం కొనడానికి వచ్చిన ఉదయభాస్కర్​లు పీలేరు బస్ స్టాండ్​కు చేరుకున్నారు.

తొలుత రెండు అసలు బంగారు పూసలను వారికి ఇచ్చి....అవి పరిశీలించిన తర్వాతే కొనాలని నమ్మబలికారు. అది బంగారమని తేలటంతో.. రూ.25 లక్షలకు నకిలీ బంగారం కొన్నారు. ఆ బంగారంతో గుంటూరుకి వెళ్ళిన ఉదయ్ కుమార్ రెండు రోజుల తర్వాత పరిశీలించగా... అవి నకిలీవని తేలడంతో లబోదిబోమన్నాడు. ముఠా సభ్యులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో గుంటూరులోని పోలీసులను ఆశ్రయించారు.

ప్రణాళికతో పట్టుకున్నారు...
సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడే ఫిర్యాదు ఇవ్వాలని వారు సూచించడంతో బాధితుడు సెప్టెంబర్ 25న పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పీలేరు పోలీసులు విచారణ చేపట్టారు. పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్నారు. వీరు నుంచి రూ.9 లక్షల నగదు, నకిలీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐలు, సిబ్బందిని సీఐ అభినందించారు.

ఇదీ చదవండి: న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.