చిత్తూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నడవలేని వృద్దులు సహాయకులతో వచ్చి ఓటు వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ జిల్లా పరిధిలో 13 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది.
మదనపల్లి
మదనపల్లి పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.రెండవ వార్డులో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇందులో వాలంటరీ ఓటర్ల స్లిప్పులు.. ఎమ్మెల్యే పంపిణీ చేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో స్థానికంగా స్వల్ప గొడవ జరిగింది.
ఇదీ చదవండీ.. విజయవాడలో ఓటేసిన పవన్ కల్యాణ్