తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీసమేతంగా పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు చౌహాన్ దంపతులకు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సీఎం నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అఖిలాండం వద్దకు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం ఆనందాన్ని కలిగించిందని సీఎం శివరాజ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నామని.. ఆత్మ నిర్భర్ మధ్యప్రదేశ్ దిశగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. దేశం స్వయంసమృద్ధి సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు శివరాజ్‌సింగ్ తెలిపారు. కరోనా నుంచి దేశం విముక్తి పొందాలని శ్రీవారిని ప్రార్థించామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ అన్నారు.
ఇదీ చదవండి:
సీబీఐది తేలాకే ఈడీ కేసు విచారణ.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు