ETV Bharat / state

మిస్బా ఆత్మహత్య కేసు నిందితుడు రమేశ్ బాబు అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్థి మిస్బా ఆత్మహత్య కేసులో నిందితుడు బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్ రమేశ్ బాబును పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులెవర్నీ వదిలి పెట్టబోమని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు.

మిస్పా ఆత్మహత్య కేసు నిందితుడు రమేశ్ బాబు అరెస్టు

author img

By

Published : Mar 26, 2022, 9:07 PM IST

Updated : Mar 27, 2022, 11:28 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్థి మిస్బా ఆత్మహత్య కేసులో నిందితుడు రమేశ్ బాబును పోలీసులు రిమాండ్​కు తరలించారు. మిస్బా మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత.. మృతికి కారకుడిగా భావిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ రమేశ్​ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిస్బా చదువుతున్న బ్రహ్మర్షి పాఠశాల నిర్వాహకులు ఫీజు విషయమై మిస్బాను వేధించారు. మిస్బా తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు పాఠశాల కరస్పాండెంట్ రమేశ్ బాబు కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. నిన్న అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం స్థానికంగా కోర్టులో హాజరుపరిచి ట్రాన్‌సిట్‌ వారెంట్‌ ద్వారా పలమనేరుకు తీసుకువచ్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులెవర్నీ వదిలి పెట్టబోమని ఎస్పీ స్పష్టం చేశారు.

వైకాపా నేత పాత్రపై అనుమానాలు: వైకాపా నేత తన కూతురు మొదటి ర్యాంకు సాధించడానికి వీలుగా మిస్బాను బ్రహ్మర్షి పాఠశాల నుంచి పంపేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వైకాపా నేత సునీల్‌కుమార్‌ కోసం ఆరా తీస్తున్నారు. మరో వైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిన్న మిస్బా తల్లిదండ్రులను ఫోన్ ద్వారా పరామర్శించారు. మాజీ మంత్రి, పలమనేరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి అమరనాథరెడ్డి మిస్బా ఇంటికి వెళ్లి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. పార్టీ తరపున ఆర్ధిక సాయం చేశారు. రాజకీయాలకు అతీతంగా మిస్బా కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఎస్పీని ఆదేశించింది. పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ను కోరింది.

ఇదీ చదవండి: చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?

Last Updated : Mar 27, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.