కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా కదిరిలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. జామియా మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ఇక్బాల్ రోడ్డు, తేరుబజారు, హిందూపురం రోడ్డు మీదుగా జాతీయ రహదారి వరకూ జరిగింది. అనంతరం వేమారెడ్డి కూడలిలో మానవహారం నిర్వహించారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పౌరసత్వ సవరణ బిల్లును అమల్లోకి తీసుకొస్తున్నారని అరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఎన్ఆర్సీ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...