సీఏఏను అమలు చేయొద్దని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయవద్దని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. విజయవాడ ఎంపీ విజ్ఞాన కేంద్రంలో తెదేపా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో అనేక అనుమానాలున్నాయని అభిప్రాయపడ్డారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులోని అంబేడ్కర్ కూడలిలో ముస్లిం సంఘాలకు మద్దతుగా బీఎస్పీ నేతలు సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో పార్టీలకతీతంగా హిందూ ముస్లిం సంఘాల ప్రతినిధులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉభయ సభల్లో బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి