చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. అధునాతన ఆడిటోరియం ప్రారంభించడమే కాకుండా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. విద్య, అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ తొలి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన సీఎం జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: