చిత్తూరు జిల్లా కల్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద బైకు అదుపుతప్పి యువకుడు గాయాలపాలయ్యాడు. అదే సమయంలో.. తిరుపతి నుంచి పుంగనూరు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి విషయం గమనించారు. తన కాన్వాయ్ ఆపించారు. పోలీసులతో కలిసి బాధితుడికి తక్షణ సేవలు అందించారు. 108కి సమాచారం అందించి.. నారావారిపల్లిలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించారు. తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులకు ఫోన్‌లో సమాచారం అందించి.. మెరుగైన సేవలు అందేలా చేశారు.
ఇటీవలే.. ఈ నెల 11న పుంగనూరుకు వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. సోమల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుబ్రమణ్యం అనే యువకుడిని తిరుపతికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఇలా... ప్రమాదాలను గమనించిన తక్షణమే స్పందించి.. బాధితులకు వైద్యసేవలు అందేలా చేసిన మంత్రిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి:
రోడ్డుపై గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చిన మంత్రి పెద్దిరెడ్డి