హంద్రీనీవా కాలువ ద్వారా ఇస్తున్న జలాలను స్థిరీకరించి కడప, చిత్తూరు జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే వైకాపా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని మొలకలవారి పల్లె సమీపంలో నాయని చెర్వు వద్ద గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
గండికోట జలాశయం నుంచి నీటిని మళ్లించి చిత్తూరు జిల్లా వాసులకు నీరు అందించడానికి 4373. 93 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. సంవత్సరంలో 120 రోజుల పాటు 20 టీఎంసీల నీటిని కడప చిత్తూరు జిల్లాలకు పైపు లైన్ల ద్వారా అందించేలా ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. గండికోట జలాశయం నుంచి తరలించే నీటిని అడవిపల్లి జలాశయానికి నింపి పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రానున్న రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి గతంలో నిర్ణయించిన 1.41 లక్షల ఎకరాలతో పాటు కొత్తగా మరో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు