చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో మంత్రి కొడాలి నాని సమావేశం నిర్వహించారు. ఇంట్లో కూర్చున్నా తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టడంతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విమర్శించారు.
తెదేపా, భాజపాలు రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. లోకేష్ వల్ల తెదేపాకు భవిష్యత్తు ఉండదని అచ్చెన్నాయుడు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు. ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ నాయకులు ఎవరి దారి వారు చూసుకోవాల్సిందేనని దుయ్యబట్టారు. అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే కార్యకర్తలకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
తిరుపతిలో చంద్రబాబు నాయుడిపై రాళ్ల దాడికి నిరసనగా....ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నాయకులు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి..పామూరు బస్టాండ్ కూడలిలో ఆందోళన వ్యక్తం చేసారు. కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేశారు. తిరుపతిలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైకాపా రాళ్ళ దాడికి పాల్పడిందన్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు మార్చిఫాస్ట్ నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటేయాలన్నారు. ఏదైనా అవసరం అయితే పోలీసులు అండగా ఉంటారని సూచించారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసులతో పాటు స్థానిక ఎస్సైలు వెంకట రాజేష్, అనూష హాజరయ్యారు
ఇవీ చదవండి