ETV Bharat / state

ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి : సామాజిక తనిఖీ అధికారులు

ఉపాధి హామీ పనుల్లో భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. గత పది రోజులుగా క్షేత్రస్థాయిలో 13.3 కోట్ల ఉపాధి హామీ పనులపై చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో తనిఖీలు నిర్వహించారు.

ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి : సామాజిక తనిఖీ అధికారులు
ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి : సామాజిక తనిఖీ అధికారులు
author img

By

Published : Oct 23, 2020, 9:44 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పనుల్లో సుమారు రూ. 16 లక్షల 60 వేల 611 రూపాయల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు వెల్లడించారు. గత పది రోజులుగా క్షేత్రస్థాయిలో 13.3 కోట్ల ఉపాధి హామీ పనులపై (వివిధ శాఖలకు సంబంధించి) తనిఖీలు నిర్వహించారు.

గ్రామాల వారీగా..

బహిరంగ సమావేశం నిర్వహించి తనిఖీ వివరాలను గ్రామాల వారీగా వెల్లడించారు. అర్ధరాత్రి వరకు బహిరంగ సమావేశం కొనసాగింది. గురువారం సామాజిక తనిఖీల్లో గుర్తించిన నిధుల దుర్వినియోగం వివరాలను అధికారులు బహిర్గతం చేశారు.

అందుకు అపరాధ రుసుం..

సామాజిక తనిఖీ బృందాలు గుర్తించిన అవకతవకల మొత్తం నిధుల గణన చేపట్టి రూ. 16 లక్షల 60 వేల 611 రూపాయల రికవరీకి ఆదేశించారు. అవకతవకలు జరిగినందున సుమారు 40 వేల 200 రూపాయల జరిమానా విధించారు. ఒక క్షేత్ర సహాయకుడు, ఒక సాంకేతిక సహాయకుడు, ఐకేపీసీసీలో ఒక్కొక్కరిని సస్పెండ్ చేశారు.

ఇవీ చూడండి :

రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.