ETV Bharat / state

కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం - సంక్షోభంలో చిత్తూరు మామిడి గుజ్జు పరిశ్రమ వార్తలు

రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణం.. రూ.1,200 కోట్ల టర్నోవర్​.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై వేల కుటుంబాలకు ఉపాధి.. ఇది ఒకప్పుడు చిత్తూరులోని మామిడి గుజ్జు పరిశ్రమ పరిస్థితి. కరోనా ప్రభావంతో నైపుణ్యం లేని సిబ్బంది కొరత.. పెరిగిన ముడి సరుకుల ధర.. పెరిగిన ఉత్పత్తి వ్యయం.. ఉత్పత్తులను ఎగుమతి చేసుకోలేని పరిస్థితులు.. ఇదీ ఇప్పుడు మామిడి గుజ్జు పరిశ్రమల దుస్థితి. ఈ నేపథ్యంలో దీనిపై ఆధారపడ్డ వేల కుటుంబాలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్తూరు మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభంపై ప్రత్యేక కథనం..!

కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం

author img

By

Published : Jun 25, 2020, 7:09 PM IST

Updated : Jun 25, 2020, 7:56 PM IST

కరోనా ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన మామిడి గుజ్జు పరిశ్రమ

కరోనా కారణంగా చిత్తూరు మామిడి గుజ్జు పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. జిల్లాలో ఉత్పత్తయ్యే మామిడి గుజ్జు 20 శాతం దేశీయంగా వినియోగిస్తుండగా.. 80 శాతం ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. కరోనా ప్రభావంతో మామిడి గుజ్జుకు ఇంటా.. బయటా మార్కెట్‌ లేక పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెడుతోంది. లాక్​డౌన్​ కారణంగా.. నైపుణ్యం కలిగిన కూలీల కొరతతో పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించలేక.. ఉత్పత్తి వ్యయం పెరిగి.. ప్రపంచ దేశాల్లో వినియోగం తగ్గి వేల కుటుంబాల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు

భౌగోళిక పరిస్థితులు.. నేల స్వభావం తదితర అనుకూలతలతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణానికి పైబడి వివిధ రకాలైన మామిడిని రైతులు పండిస్తున్నారు. బేనిషా, నీలం, కాదర్‌, మల్లిక వంటి టేబుల్‌ రకాలతో పాటు మామిడి గుజ్జు తీయడానికి మాత్రమే వినియోగించే తోతాపురి రకాన్ని సాగు చేస్తున్నారు. 60 శాతం పైబడి విస్తీర్ణంలో తోతాపురి రకం సాగవడం వల్ల వాటి ఆధారంగా జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

45 పరిశ్రమల్లో ఉత్పత్తి

జిల్లా వ్యాప్తంగా 45 పరిశ్రమలు రైతుల నుంచి తోతాపురి రకం మామిడి పంటను కొనుగోలు చేసి గుజ్జు ఉత్పత్తి చేయడం ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. సాధారణంగా మామిడి పంటను ప్రాసెస్‌ చేయడానికి ఇండివిజువల్‌ క్విక్‌ ఫ్రీజ్‌, డీ హైడ్రేటెడ్‌, అసెప్టిక్‌, క్యానింగ్‌ వంటి నాలుగు రకాల పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రధానమైనవి అసెప్టిక్‌, క్యానింగ్‌ రకం పరిశ్రమలు.

పరిశ్రమల్లో ఉత్పత్తి ఇలా..!

ఇండివిజువల్​ క్విక్​ ఫ్రీజ్​(ఐక్యూఎఫ్​) పరిశ్రమ - ఈ పరిశ్రమల్లో మామిడి కాయలు తొక్కతీసి చిన్న ముక్కలుగా తరిగి వాటిని మైనస్​ 21 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫ్రీజ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.

అసెప్టిక్ పరిశ్రమ - మామిడి గుజ్జును తీసి అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి పెద్ద డ్రమ్ముల్లో నిల్వచేస్తారు. క్యానింగ్‌ పరిశ్రమల్లో అసెప్టిక్ తరహాలోనే గుజ్జు తీసి చిన్నచిన్న డబ్బాలకు నింపుతారు.

ఏడాదిలో మూడు నెలలు మాత్రమే

మామిడి గుజ్జు ఉత్పత్తి ఏడాదిలో మూడు నెలల పాటు మాత్రమే సాగుతుంది. మే నెలలో ఆల్పోన్సా రకంతో ప్రారంభమై.. జులై చివరి నాటికి తోతాపురి రకం గుజ్జుతో ముగుస్తుంది.

వేధిస్తోన్న కూలీల కొరత

ఉత్పత్తి ప్రారంభించడానికి నెల రోజుల ముందు నుంచే యజమానులు పరిశ్రమ నిర్వహణ కార్యక్రమాలు చేపడతారు. ఇండివిజువల్​ క్విక్​ ఫ్రీజ్​(ఐక్యూఎఫ్​) పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన కూలీల వినియోగం అధికంగా ఉంటుంది. పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించడానికి రెండు, మూడు వారాల ముందు.. పశ్చిమబంగ, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తారు. ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్‌తో ఆయా రాష్ట్రాల నుంచి కూలీల రాక ఆగిపోయింది. ఫలితంగా కూలీల కొరతతో ఉత్పత్తి కష్టంగా మారింది. స్థానికంగా ఉన్న కూలీలకు శిక్షణ ఇచ్చినా ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారు.

250 టన్నులకే పరిమితం

జిల్లాలోని 45 పరిశ్రమల్లో 34 అసెప్టిక్‌, 8 క్యానింగ్‌ పరిశ్రమల ద్వారా ఏడాదికి ఆరు లక్షల టన్నుల మామిడి పంటను ప్రాసెస్‌ చేయడం ద్వారా మూడున్నర లక్షల టన్నుల గుజ్జు ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా క్రమంలో ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. 1250 మెట్రిక్​ టన్నులు ఉత్పత్తి చేసే ఓ పరిశ్రమ కేవలం 250 టన్నులకే పరిమితం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్​డౌన్​ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రాక.. ఇక్కడ ఉండే కూలీల్లో నైపుణ్యం లేకపోవడం వల్ల ఉత్పత్తి కష్టంగా మారింది. తరచూ పరిశ్రమకు విరామం ఇస్తుండటం వల్ల కూడా ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోయినట్లు పరిశ్రమల యజమానులు తెలిపారు.

ఇంతటి సంక్షోభం ఇదే తొలిసారి

రెండు, మూడు దశాబ్ధాలుగా మామిడి గుజ్జు పరిశ్రమ రంగంలో ఉన్నా ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని.. పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో సమస్యతో పరిశ్రమల నిర్వహణ తమకు అనుభమేనని అయినా ముప్పేట సమస్యలు ఏనాడూ చూడలేదని అంటున్నారు. మరోవైపు ఈ రంగంపై ఆధారపడ్డ వేల కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

సంవత్సరంలో మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే నడిచే మామిడి గుజ్జు పరిశ్రమపై... కరోనా తీవ్ర ప్రభావమే చూపింది. సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు కరోనా వెంటాడుతూనే ఉన్న క్రమంలో ఈ ఏడాది పూర్తిగా నష్టపోయినట్లేనని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కరోనా ఎఫెక్ట్: తెరపై పడని బొమ్మ.. థియేటర్ సిబ్బంది ఆదాయం సున్నా..

Last Updated : Jun 25, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.