విద్యా దీవెన కింద లబ్ధిదారులైన విద్యార్థులతో పాటు తల్లులను వెంట తీసుకురావాలని సచివాలయ సంక్షేమ సహాయకులను ఆదేశించారు. వీరికి ప్రత్యేకంగా బస్సులు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వినియోగించారు. మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల నుంచి టిప్పు సుల్తాన్ మైదానం వరకు దారి మధ్యలో ఉన్న దుకాణాలను బుధవారం వేకువజాము నుంచి మూసివేశారు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు ఇనుప బారికేడ్లు, రోడ్డుకిరువైపులా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు ముందస్తుగానే పల్లె వెలుగు సర్వీసులు రద్దు చేశారు.
ఇవీ చదవండి: