తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు - తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. తితిదే సిబ్బంది వాటిని జేసీబీ సాయంతో తొలగించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగపడ్డ కొండచరియలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి కొండచరియలు విరిగి పడ్డాయి. రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు... మొదటి ఘాట్ రోడ్లోని 53, 54 మలుపుల వద్ద కొండ రాళ్ళు విరిగి రహదారిపై పడ్డాయి. రాత్రి సమయాల్లో ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతులు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. తితిదే ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది రహదారిపై పడిన కొండ చరియలను జేసీబీ సాయంతో తొలగించారు.