ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో.. వివాహిత మృతి - putthur lady suspect death news

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో జరిగింది. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

lady suspect death
వివాహిత అనుమానాస్పద మృతి
author img

By

Published : Feb 20, 2021, 11:21 AM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం దళితవాడలో పూజ అనే వివాహిత... అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపంతో.. ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని... సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. పూజకు ఆరు సంవత్సరాల క్రితం.. అదే ప్రాంతానికి చెందిన సాయికుమార్​తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వృత్తిరీత్యా పారిశుద్ధ్య కార్మికుడైన సాయి కుమార్.. విరామ సమయంలో ఆటో నడిపేవాడు.

ఇటీవలే పూజ పొదుపు సంఘంలో చేరి.. కొంత నగదు అప్పు తీసుకుంది. నెలనెలా రుణాన్ని చెల్లించేటట్లు ఒప్పందం పెట్టుకున్నారు. అయితే ఈ నెల నగదు మెుత్తాన్ని.. పూజా తన భర్తకు ఇచ్చినా, సాయి కుమార్ వాటిని విలాసాలకు ఖర్చుపెట్టేశాడు. ఈ విషయంపై భర్తను నిలదీసి.. అప్పును చెల్లించలేననే మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

పుత్తూరులో గజరాజులు హల్​చల్.. తరిమేందుకు స్థానికుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.