ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ... జనసేనకు మద్దతు ప్రకటించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ నాయుడు తరఫున ప్రచారం చేశారు. ప్రజాసేవ చేయాలనే విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి శ్రీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఇంటింటికీ తిరుగుతూ జనసేన మేనిఫెస్టో వివరించారు. గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు. మార్పు కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవిధంగా మేనిఫెస్టో సిద్ధం చేశారని తెలిపారు.
ఇదీ చదవండి...ప్రచారానికి రాలేదని కక్షతో కొట్టిన వైకాపా నేతలు