చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తుల వాహనాలకు అనధికారికంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ అక్రమార్కులు కోట్లను దోచేస్తున్నారు. ఆలయానికి పార్కింగ్ టెండర్తో ప్రతి ఏటా రూ 1.20కోట్లు ఆదాయం వస్తుంది. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తో పాటు పలు రాష్ట్రాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలయ దర్శన వేళలు కుదించారు.
దీంతో.. పార్కింగ్ టెండర్ దారులు వసూలు చేయలేమని చేతులెత్తేశారు. దీనికి అనుగుణంగా భక్తుల రాక అంతంత మాత్రమే ఉండడంతో ఆలయ అధికారులు పార్కింగ్ విషయం పట్టించుకోలేదు. అయితే గత ఏప్రిల్ నుంచి పార్కింగ్ ఉచితమని ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గుతుండటం ఇందుకు తగ్గట్టుగా ఆయా రాష్ట్రాల కర్ఫ్యూను సడలింపు చేస్తున్నారు. దీంతో ఉదయం 6 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆలయంలో దర్శన వేళలు పెంచారు.
భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా వాహనాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అయితే ఆలయం తరఫున పార్కింగ్ లేకున్నా కొందరు అక్రమార్కులు పార్కింగ్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే... విమర్శలకు కారణమవుతుంది. ఇవన్నీ తెలిసిన ఆలయ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి: