ETV Bharat / state

విషాదం: అర్ధాంగి ఒడిలో అర్థాంతరంగా ఆగిన గుండె - kuppam latest news

కరోనా నుంచి కోలుకున్న దంపతులు ఇంటికి బయల్దేరారు. అంతలోనే.. భర్తకు మళ్లీ సమస్య తలెత్తింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతను.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. తన కళ్లెదుటే భర్త చనిపోవడంపై... భార్య రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

husband death in front of his wife
కుప్పంలో వ్యక్తి మృతి
author img

By

Published : May 6, 2021, 5:28 PM IST

కుప్పంలో వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్... అతని భార్యతో కలిసి బెంగళూరులో నివసించేవాడు. వీరికి కరోనా సోకిన కారణంగా.. కుప్పం వచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.

అనంతరం బెంగళూరు వెళ్లేందుకు కుప్పం రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. అక్కడ ప్లాట్​ఫాంపై రైలు కోసం నిరీక్షిస్తుండగా... చంద్రశేఖర్ మళ్లీ అస్వస్థతకు గురై భార్య ఒడిలో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టింది.

ఇదీ చదవండి:

సంగం డెయిరీలో అనిశా తనిఖీలు.. బయటివాళ్లు వచ్చారంటూ అడ్డుకున్న యాజమాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.