చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ అటెండరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు కరోనా సోకగా.. క్వారంటైన్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకుని ఆనందంగా ఇంటికి వెళ్లారు. అయితే... ఆ ఇంటి యజమాని ఆమెను లోపలికి రానివ్వలేదు. వైరస్ బారిన పడిన ఆమె ఇంట్లోకి రావడానికి వీల్లేదన్నారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆ మహిళకు మరొక చోట బస ఏర్పాటు చేశారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి విషయంలో వెలి వేసినట్టుగా ప్రవర్తించవద్దని ప్రభుత్వం, ఉన్నతాధికారులు, వైద్యులు కోరుతూనే ఉన్నారు. వారికి బాసటగా నిలవాలని చెబుతున్నారు. అయినా.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.
ఇవీ చదవండి:
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి