ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

అడుగడుగునా ఆటంకాలు...అంతమొందిస్తామని బెదిరింపులు... నామినేషన్ల పత్రాలతో పరుగులు... సభ్యత, సంస్కారం లేని పదజాలం.... మహిళలపైనా దాడులకు తెగబడటం.... జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో జరిగిన ఈ అరాచకమే పురపాలక నామినేషన్ల పర్వంలోనూ కొనసాగింది. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండకు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు భయంతో బెంబేలెత్తిపోయారు.

high tension in chittoor
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు
author img

By

Published : Mar 14, 2020, 10:06 AM IST

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పలుచోట్ల తెలుగుదేశం అభ్యర్థుల నుంచి వైకాపా నేతలు నామినేషన్ పత్రాలు లాక్కొడం, దాడులకు పాల్పడటం జరిగింది. వందలాది మంది వైకాపా కార్యకర్తలు నామినేషన్లు వేసే క్యూలైన్‌ వరుసల్లో నిల్చుని మిగిలిన అభ్యర్థులకు సమయం మించిపోయే వరకు చోటివ్వలేదు. క్యూలైన్‌లో ఉన్నవారి చేతుల్లో నామపత్రాలు లాక్కుని పారిపోయారు.

2 డివిజన్‌లో ఓ అభ్యర్థిని రెండురోజుల పాటు నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినా వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. కొన్నిచోట్ల భయపెట్టి పోటీలో ఎవరూ లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. వైకాపా మేయర్ అభ్యర్థికి పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని భర్తను అపహరించుకుపోయారు. పోలీసుల సమక్షంలోనే పలువురు తెలుగుదేశం అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. 16వ వార్డులో నామినేషన్‌ దాఖలుకు వచ్చిన తెదేపా అభ్యర్థి శ్రీకాంత్‌ను అధికార పార్టీ నేతలు విచక్షణారహితంగా కొట్టటంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది... వారికి అండగా నిలిచేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎదుటే దౌర్జన్యానికి దిగారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఘటనలపై సుగుణమ్మ ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్ధ్‌ జైన్‌కు ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని పుంగనూరు నగరపాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ రసాభాసగా మారింది. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటూ....వారిపై వైకాపా నాయకులు విరుచుకుపడ్డారు. పుంగనూరు 15వ వార్డులో తెదేపా తరపున నామినేషన్‌ వేసేందుకు వచ్చిన రాజమ్మ అనే మహిళపై వారు దాడికి దిగారు. మామూలు వేషధారణలో వస్తే గుర్తుపడతారని బురఖా వేసుకుని వచ్చిన ఆమెపై, వెంట ఉన్న భర్తపైనా వైకాపా నేతలు భౌతిక దాడికి తెగబడ్డారు. పుంగనూరు 6వ వార్డులో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థి విజయమ్మ పత్రాలను వైకాపా నేతలు లాక్కుని పరారయ్యారు. ఆగ్రహించిన ఆమె... ఆత్మహత్యాయత్నం చేసింది.

వైకాపా దాష్టీకాలను భరించలేక కురుబల కోట మండలం, పుంగనూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో తెదేపా ఎన్నికలను బహిష్కరించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకగ్రీవమే లక్ష్యంగా చేసుకున్న వైకాపా నేతలు.... ఏర్పేడు, రేణిగుంటకు చెందిన జనసేన జడ్పీటీసీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగారు. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి... పార్టీ ఇంఛార్జ్‌ నగరం వినుతకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

ఇవీ చూడండి-మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.