ETV Bharat / state

తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ

అమరావతికి అనుకూలంగా తిరుపతిలోని తేదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్న ర్యాలీ, భహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వలేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు.

author img

By

Published : Jan 11, 2020, 6:36 AM IST

Government refuses the chandrababu naidu attend Tirupati rally and 144 secton implimented
తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ..

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఐక్య కార్యచరణ కమిటీ నేడు తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, భహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పోలీస్​ అధికారులు శుక్రవారం సాయంత్రం నుంచే ఆంక్షలు విధించారు. నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం(12వ తేది) సాయంత్రం 6 గంటల వరకూ ఇవి అమలులో ఉంటాయని తిరుపతి( అర్బన్) తహసీల్దారు, మండల ఎగ్జిక్యూటివ్​ మెజిస్ట్రేట్​ వెంకట రమణ ఆదేశాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్న ఈ కార్యక్రమాలకు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వలేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

'అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదు'

Intro:Body:

babu anumati

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.