CM Chandrababu Delhi Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన ఖారురు అయ్యింది. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు దేశరాజధానిలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ సహా వివిధ శాఖల కేంద్రమంత్రులతో కీలక అంశాలపై సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం అవనున్నారు. మంగళవారం హోమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.
బుడమేరు వరదలై నివేదిక ఇచ్చాక సీఎం చంద్రబాబు తొలిసారి ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలలో ఆటంకం లేకుండా చూడాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపైనా చర్చించే అవకాశం ఉంది.
దిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి లాభం : చంద్రబాబు దిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి లాభం జరుగుతోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించినట్లు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వినుకొండ, పల్నాడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని సంకల్పించిందని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. వినుకొండ-గుంటూరు హైవేను 4 వరుసలుగా విస్తరిస్తామన్నారు. వినుకొండ-గుంటూరు 90 కి.మీ. రోడ్డుకు రూ.2,360 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబుతో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ : చంద్రబాబుతో మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యి సుమారు అర గంటపాటు చర్చించుకున్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసిన విషయం తెలిసిందే.