స్నానాల గదుల్లో నివసించే వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండా.. బంగ్లాలో ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వడం దారుణమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన బాధ్యులు యుగంధర్ పొన్న ఆరోపించారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి బాధ్యత వహిస్తున్న నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర స్థాయి అక్రమాలు జరిగాయని యుగంధర్ ఆరోపించారు. అర్హులైన పేదలకు బదులు ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బందికి స్థలాలు మంజూరు చేశారన్నారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో భూమి కేటాయించి అధికారులు చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: