చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి నేతృత్వంలో రైతు దగా దినోత్సవం పేరిట.. ఈ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆదుకునే ఆపన్న హస్తం లేక అవస్థలు పడుతున్నారని.. విమర్శించారు.
పట్టించుకోవాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించి ఉత్సవాలు జరపడం శోచనీయమని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'రైతు దగా దినోత్సవం' పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆందోళనలు