తీహార్ జైలుకు వెళ్ళివచ్చిన వారిని తితిదే ధర్మకర్తల మండలిలోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చితామోహన్ అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. పవిత్రమైన దేవస్థానంలో జైలుకు వెళ్లివచ్చిన వారిని నియమించడం అంటే ధర్మకర్తల మండలి అన్న పదానికి అర్ధం మారిందన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందన్నారు.
డ్రగ్స్, గంజాయి రవాణా నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని చింతామోహన్ మండిపడ్డారు. పార్టీలు పెట్టడం ద్వారా రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడు సంవత్సరాల్లో రామమందిరం విషయంలో తప్ప భాజపా సాధించిందేంటని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి బాగాలేదన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నానని.. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి