దేశ రాజధానిలోని ఎర్రకోట ఘటన భాజపా పనే అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతిలోని ఆయన నివాసంలో మాట్లాడిన ఆయన... రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అన్నదాతల పోరాటాన్ని బలహీన పరిచేందుకు భాజపా కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ మొండి వైఖరి వీడాలని సూచించారు. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకు వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక పనులను ప్రభుత్వం వెంటనే మానుకోకుంటే ఈ నెల 30న గాంధీ వర్ధంతి రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘీభావ దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: