చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రుల ఆశలు..ఆశయాలను తుంచివేస్తూ తీరని విషాదాన్ని కలిగిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతిపురం మండలం రాళ్లబూదుగురు గ్రామానికి చెందిన కిరణ్ కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన కిరణ్...నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పులో కూరకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 'నాలా ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు' అని సామాజిక మాధ్యమాల్లో సందేశమిచ్చి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విద్యార్థి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
కుప్పంలో విద్యార్థి ఆత్మహత్య పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బసవరాజ్ కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి, భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. బెట్టింగులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఇదీచదవండి