ETV Bharat / state

పొలంలోని విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి - elephant died sue to elecrical shock mogilavari palle

చిత్తూరు జిల్లా మొగిలివారిపల్లిలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. విద్యుత్ తీగలు పడిన విషయం పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.

elephant-killed-by-electrocution-at-chittor
పొలంలోని విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి
author img

By

Published : Dec 2, 2019, 3:10 PM IST

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లిలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. పొలాల్లోకి ఒకేసారి 15 ఏనుగులు రాగా... వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి ఒక ఏనుగు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో... ఏనుగులు పొలాల్లోకి చేరి పంట నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. అటవీ అధికారుల సహకారంతో బాణాసంచా కాల్చినప్పటకీ ఏనుగులు భయపడటం లేదని తెలిపారు. విద్యుత్‌ తీగలు పడిన విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టాలని కోరారు.

పొలంలోని విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి

ఇవీ చూడండి- తాగి యువతిని చుట్టుముట్టారు...అసభ్యంగా ప్రవర్తించారు

Intro:ap_tpt_51_02_elephant_died_due_to_current_shock_avb_ap10105

విద్యుదాఘాతంతో ఏనుగు మృతిBody:చిత్తూరు జిల్లా పలమనేరు

బంగారుపాలెం మండలం మొగిలి వారి పల్లి గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో దాదాపు 15 ఏనుగులు గుంపుగా పొలాల్లోకి రావడంతో పంట పొలాల్లో క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఒక మగ ఏనుగు మృతి చెందింది.

రైతుల కథనం మేరకు గత రెండు నెలలుగా ఏనుగులు రావడం లేదని... పంటలు ఇప్పుడు కోతలకు రావడంతో మళ్లీ ఏనుగులు పంట పొలాల వైపుకు వస్తున్నాయన్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని వారు ప్రతిరోజు బాణసంచా కాలుస్తూ వాటిని తరుముతున్నా మరలా పంటపొలాల వైపుకు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సైతం 15 ఏనుగులు గుంపుగా పంట పొలాల వైపుకు వస్తుండగా... పొలాల సమీపంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు గత కొంతకాలంగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. వన్యమృగాలు కాకుండా రైతులకు కూడా అపాయం ఉందని చెప్పిన రైతులు సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు

బైట్ 1: రైతు, చంగల్ రాయ నాయుడు

బైట్2: రైతు, కోదండ నాయుడుConclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.