తిరుపతి రూరల్ మండలం మల్లవరం గ్రామంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. చాంద్ భాషా అనే వ్యక్తి వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంటిలో ఉన్న టీవీ, వాషింగ్ మిషన్, బట్టలు కాలి బూడిదయ్యాయి. సుమారు 9.30 లక్షలు విలువైన బంగారం, డబ్బులు కాలి బూడిదయ్యాయి. సర్వం అగ్గిపాలు కావడంతో కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డుపై నిలిచింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు...రూ.9 లక్షలు స్వాధీనం