ETV Bharat / state

150 ఏళ్ల మహా వృక్షం..కాపాడుతున్న దాతలు

నీటి ఎద్దటికి మనుషులు, మూగజీవాలే కాదు.. ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించిన 150 ఏళ్ల ఓ మర్రిమాను నీరు లేక వెలవెలబోతోంది. అది చూడలేని కొంతమంది దాతలు ట్యాంకర్లతో వృక్షానికి నీటిని అందిస్తూ పూర్వవైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

150 ఏళ్ల మహావృక్షానికి ప్రాణం పోసిన దాతలు
author img

By

Published : Aug 10, 2019, 7:50 PM IST

150 ఏళ్ల మహావృక్షానికి ప్రాణం పోసిన దాతలు

ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం దాదాపుగా అంతరించిపోయే స్థితికి చేరుకుంది. అలా చూడలేని కొంతమంది దాతలు ముందుకొచ్చి మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమానుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా ఎద్దులవారికోట వద్ద ఉన్న చిన్న తిమ్మమ్మ మర్రిమాను ఉంది. 180కి పైగా ఊడలతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మహావృక్షానికి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కింది. భూమిలో తేమ పూర్తిగా అడుగంటిపోవటంతో చెట్టుకు నీరందించే వేర్లు, మొదలు, కాండాలు దెబ్బతిన్నాయి. నీళ్లులేక ఎండిపోతున్న మహావృక్షాన్ని కాపాడేందుకు ఎలాంటి అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహావృక్షాన్ని ఎలా అయిన రక్షించుకోవాలని పరిసర ప్రాంతాల దాతలు ముందుకొచ్చారు. గత 30 రోజులుగా రోజు 3 నుంచి 5 ట్యాంకర్ల నీటిని చెట్టు మొదల్లో పోస్తుండటంతో మహావృక్షం ప్రాణం పోసుకుంది. మహావృక్షానికి ట్యాంకర్ల నీటితో ప్రాణం పోసిన దాతలను పరిసర ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ మహావృక్షాన్ని 150 ఏళ్ల క్రితం తిమ్మమ్మ మర్రిమాను కాడను తెచ్చి ఎద్దులవారి కోటకు చెందిన ఓ వృద్ధురాలు ఇక్కడ నాటినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇది చూడండి: సీడబ్ల్యూసీ: సారథిపై రాని స్పష్టత- రాత్రికి తేలే అవకాశం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు కంట్రిబ్యూటర్.

టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హోండా షోరూమ్‌ను రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. కోడెల బినామీ నరసరావుపేట యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారరావడం తో నరసరావుపేట, గుంటూరు లోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్‌ చేశారు.Body:విజువల్స్... ఫొటోస్.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.