రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి వైఎస్సార్ 'రైతు భరోసా - పీఎం కిసాన్ యోజన' పథకం రెండో విడత చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతోందన్నారు.
ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో పాటు సాగు నీటి సమస్యను పరిష్కరిస్తూ రైతు రాజ్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మి.. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తున్నామన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి సబ్సిడీపై విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి... కోవిడ్ ఆసుపత్రులకు.. ఎల్జీ ఉపకరణాలు