ETV Bharat / state

మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ టీచర్​ సస్పెండ్.. డీఈవో ఉత్తర్వులు - మిస్బా కుటుంబీకులు ధర్నా

మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ టీచర్‌ రమేశ్‌పై వేటు

author img

By

Published : Mar 24, 2022, 4:16 PM IST

Updated : Mar 24, 2022, 7:13 PM IST

15:59 March 24

పలమనేరులో మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ టీచర్‌ రమేశ్‌పై వేటు

Misba Suicide Case News: చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. గంగవరం జెడ్పీ హైస్కూల్​లో హిందీ పండిట్​గా పనిచేస్తున్న రమేశ్​ను సస్పెండ్​ చేస్తూ.. డీఈవో శ్రీధర్​ ఉత్తర్వులు ఇచ్చారు. మిస్బా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పలమనేరు డీఎస్పీ కార్యాలయం ముందు మిస్బా కుటుంబీకులు ధర్నా చేపట్టారు.

పలమనేరు బ్రహ్మర్షి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మిస్బా.. మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల కరస్పాడెంట్ వేధింపుల వల్లే మిస్బా బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్.. తన భార్య పేరిట బ్రహ్మర్షి పాఠశాల నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మిస్బా మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలి: అంతకుముందు పలమనేరు డీఎస్పీ కార్యాలయం ముందు మిస్బా కుటుంబీకులు ధర్నా చేపట్టారు. మిస్బా మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని మిస్బా కుటుంబం ఆరోపించారు. ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు భద్రత కల్పించట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మిస్బా చ‌దువుల్లో మేటిగా రాణిస్తూ.. ప‌దోత‌ర‌గ‌తి టాప‌ర్‌గా నిల‌వ‌డం వైకాపా కాల‌కేయుల‌కి క‌న్నుకుట్టిందని లోకేశ్​​ ధ్వజమెత్తారు. సోడా అమ్ముకునే వాళ్లకు చ‌దువులూ, మార్కులా అంటూ వేధింపులకు గురిచేసి స్కూల్ నుంచి పంపేయ‌డం చాలా దారుణమన్నారు. చ‌దువుల త‌ల్లి మిస్బా మ‌ర‌ణానికి కార‌ణమైన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

నాయ‌కుడు జ‌గ‌న్‌రెడ్డిదేమో ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్లు ఎత్తుకొచ్చిన ద‌గుల్బాజీ చ‌రిత్ర అయితే...ఆయ‌న పార్టీ నేత‌ల‌ది త‌న కూతుర్ని టాప‌ర్‌గా నిలపాలనే ఆశతో నిరుపేద విద్యార్థినిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడేలా చేసిన నీచ‌చ‌రిత్ర అని మండిపడ్డారు. కూలి ప‌నులు చేసుకుంటూ త‌మ పిల్లలను చ‌దివించ‌డ‌మే ఆ పేద‌ త‌ల్లిదండ్రుల చేసిన పాప‌మా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధంచిన వీడియోలను తన ట్విట్టర్​లో పోస్టు చేశారు లోకేశ్​.

ఇదీ చదవండి: మూడు రాజధానులు కావాలంటే ఆ చట్టాన్ని సవరించాలి: లోకేశ్​

Last Updated : Mar 24, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.