చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా చాలా ఆలస్యంగా ప్రధాని మోదీ వ్యాక్సిన్ల పంపిణీపై నిర్ణయం తీసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) ఎద్దేవా చేశారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో అనేక రాష్ట్రాలు మొదటి నుంచి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి ఈ విషయంలో లేఖలు రాశారని గుర్తు చేశారు.
ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉంటే చాలామంది ప్రజల ప్రాణాలు నిలిచేవని నారాయణ వ్యాఖ్యనించారు. రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి లేకుండా వ్యాక్సిన్ల పంపిణీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి