కాలుష్యాన్ని సాకుగా చూపి, అమరరాజా పరిశ్రమను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి తిరుపతిలో ఈ విషయమై మాట్లాడారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తే.. కులాలను అంటగట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కుడా తరలిపోయే పరిస్ధితి నెలకొందని రామకృష్ణ విమర్శించారు. స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ. వేల కోట్లు అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. మద్యం, ఇసుక, గనుల వ్యాపారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధినేతగా మారాడని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
Cheating Love: ప్రేమ పేరుతో మోసం.. టిండర్ యాప్ ద్వారా పరిచయం