చిత్తూరు జిల్లా తిరుపతిలో పెట్రోడీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. దేశంలో పెట్రోడీజిల్ ధరలు పెరుగుతుండడం కేంద్ర ప్రభుత్వ దురుద్దేశపూర్వక చర్యేనని మండిపడ్డారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టిన సీపీఐ నాయకులు...డోలీలపై మనుషులను ఊరేగిస్తూ తమ నిరసన తెలియచేశారు.
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు రోజురోజుకూ తగ్గుతూ ఉంటే... మన దేశంలో మాత్రం కేంద్రం అధిక పన్నులు విధిస్తూ, పెట్రోధరలు పెరిగేలా చేస్తోందంటూ సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'