ETV Bharat / state

చిత్తూరు జిల్లా అధికారులను వేధిస్తున్న కొత్త సమస్య - corona cases in tirupati

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పరీక్షల సమయంలో.. తప్పుడు సమాచారం ఇస్తుండటం వల్ల.. ఫలితాలు వచ్చినా వారిని గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో వెయ్యికిపైగా పాజిటివ్‌ వ్యక్తుల ఆచూకీ లభించకపోవడం అధికారుల్ని కలవరపెడుతోంది.

చిత్తూరు జిల్లా అధికారులను వేధిస్తున్న కొత్త సమస్య

author img

By

Published : Apr 29, 2021, 5:04 AM IST

Updated : Apr 29, 2021, 6:12 AM IST

చిత్తూరు జిల్లా అధికారులను వేధిస్తున్న కొత్త సమస్య

చిత్తూరు జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తుంటే... వందల సంఖ్యలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఆచూకీ దొరకకుండా పోతుండటం మరింత కలవరపెడుతోంది. నమూనాలు ఇచ్చే సమయంలో తప్పుడు ఫోన్‌ నెంబర్లు, చిరునామాలు ఇస్తూ కొందరు అధికారుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మరికొందరు ఫోన్‌లు స్విచ్ఛాప్‌ చేస్తుండగా... ఇంకొందరు ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీని వల్ల పాజిటివ్‌ వచ్చినా వారిని గుర్తించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా దొరకకుండా ప్రజల్లో తిరిగే పాజిటివ్ వ్యక్తుల వల్ల.. కొవిడ్‌ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో గత రెండు నెలల నమూనాలను పరీక్షించగా.. ఏప్రిల్ 25 నాటికి 9వేల 164మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో ఇప్పటివరకూ 7వేల270మందినే అధికారులు గుర్తించగలిగారు. మరో వెయ్యి 49మంది ఎక్కడున్నారనే విషయమే తెలియడం లేదు. వీళ్లంతా హోం ఐసోలేషన్ లో ఉన్నారా.. లేదా మరెక్కడికైనా వెళ్లారా అనే వివరాలు తెలియని పరిస్థితి. ఒక్క తిరుపతి పరిధిలోనే... పాజిటివ్‌గా తేలిన 845 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

ఇలా సరైన వివరాలు ఇవ్వని కారణంగా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పరీక్షలకు ఇచ్చే సమయంలో బాధ్యతగా మెలగాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

కరోనాతో మరో ముగ్గురు తితిదే ఉద్యోగులు మృతి

నంద్యాలలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య

Last Updated : Apr 29, 2021, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.