చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట ఎరుకుల కాలనీలో సెల్ఫోన్ విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి వద్ద ఫోన్ని కొదవ పెడితే... ఎక్కువ డబ్బులకు అమ్మేసుకున్నారన్న కారణంగా మొదలైన గొడవ.. కత్తులు ఇనుపరాడ్లతో కొట్టుకునే వరకూ చేరింది. ఈ గొడవలో ఇరువర్గాలకు సంబంధించి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పూతలపట్టు ఎస్సై.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సంఘటనా స్థలాని చేరుకున్న పోలీసులు.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్