విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. చిత్తూరు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజరు సోమయాజులును సరెండర్ చేస్తూ కలెక్టర్ మార్కండేయులు.. ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పౌర సరఫరాల సంస్థ ఎండీ సూర్య కుమారికి పంపారు. సోమయాజులు గతేడాది నవంబరు 6న డీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి సంస్థ కార్యకలాపాలు అస్తవ్యస్తంగా తయారైనట్లు సిబ్బంది ఆరోపణలున్నాయి.
దుకాణాలకు రేషన్ సరకుల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. అసభ్యకర పదజాలంతో తమల్ని దూషించారంటూ ఇటీవల సంస్థ గోదాము డీటీలు, అధికారులు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ తరుణంలో పనితీరు మెరుగుపరచుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. అయినప్పటికీ డీఎంలో ఎటువంటి మార్పూ.. రాలేదు. ఈ పరిస్థితుల్లో.. డీఎంను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సంస్థలో సహాయ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇబ్రహీంకు డీఎంగా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: