చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సందర్శించారు. ఎస్వీ వైద్య కళాశాలలో కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలకు బయో సేఫ్టీ మిషన్ అవసరమని... దానిని పరిశీలించేందుకు గ్రామీణ ఆరోగ్య పరిశోధన కేంద్రానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. 'లెవల్ త్రీ' మిషన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఎస్వీయూలోని 'లెవల్ టూ' బయో సేఫ్టీ మిషన్ను, ఐజర్లో ఉన్న మరో మిషన్ను కూడా పరిశీలించి ఎస్వీ వైద్య కళాశాలకు తరలిస్తామన్నారు. దీనివల్ల రోజూ 100 నుంచి 150 వరకు ఎక్కువ పరీక్షలు చేయవచ్చని అన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాధమ్మ, సీఐ రామచంద్రారెడ్డి, రూరల్ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ ఉన్నారు.
ఇదీ చదవండి