చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 28న సీఎం పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా స్థానిక అధికారులతో సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగబోయే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉరందూరులోని ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ జాగ్రత్తలు మరచి.. భారీ కృతజ్ఞతా ర్యాలీ!