చిత్తూరు జిల్లాలో కొవిడ్ 19 వైద్య సేవలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 23 కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జి అయ్యారని తెలిపారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. జిల్లా వ్యాప్తంగా 6 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. శ్రీకాళహస్తిలో పాజిటివ్ వచ్చిన వారు గడచిన రెండు వారాలుగా క్వారెంటైన్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పలమనేరు 3, శ్రీకాళహస్తి 5, ఏర్పేడు 1, తిరుపతి 6 , రేణిగుంట 2, నిండ్ర 1, నగరి 4 , వడమాల పేట 1 పాజిటివ్ కేసులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగిస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి : పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నాం: ఆదిమూలపు సురేష్