రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలకు సంబంధించి...జిల్లా ఎన్నికల షెడ్యూల్ను కలెక్టర్ భరత్ గుప్తా విడుదల చేశారు. ఈనెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 12వ తేదీ పరిశీలన, 13వ తేది సాయంత్రం 5 గంటల వరకు తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు, 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటలలోగా అప్పీల్ పరిష్కారం, మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. 21వ తేదీన ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని, 24వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల - local bodies elections in chittor news
చిత్తూరు జిల్లాలో నిర్వహించే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిర్వహణకు సంబంధించిన వివరాలను ఎస్పీతో కలిసి వెల్లడించారు.

TAGGED:
Meet