ETV Bharat / state

కరోనా నివారణకు ప్రత్యేక అధికారుల నియామకం - special officers for preventing of corona in chittor

చిత్తూరు జిల్లాలో 20 కరోనా పాజిటివ్​ కేసులు రావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 7 ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. కరోనా నియంత్రణ పర్యవేక్షణకు 26 మంది అధికారుల బృందాన్ని కలెక్టర్​ నియమించారు. క్వారంటైన్లలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

చిత్తూరు జిల్లాలో కరోనా నివారణకు ప్రత్యేకాధికారుల నియామకం

author img

By

Published : Apr 11, 2020, 1:10 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జేసీ సహా 26 మంది జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదేశాలిచ్చారు. వీరు రాష్ట్ర, జిల్లా కొవిడ్‌ ఆసుపత్రుల పర్యవేక్షణ మొదలు.. సామగ్రి పంపిణీ, క్వారంటైన్‌ కేంద్రాలు, పునరావాస శిబిరాలు, శాంపిళ్ల సేకరణ, ఇంటింటి సర్వే, నిత్యావసరాల సరఫరా, మొబైల్‌ రైతుబజార్ల పర్యవేక్షణ, బయోవేస్ట్‌ తరలింపును పర్యవేక్షించి కలెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది.

జిల్లాలో ఏడు రెడ్‌జోన్‌లు

కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ఏడు ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్లుగా శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఆయా ప్రాంతాలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధిని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా, ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్​ జోన్​గా ప్రకటించారు. అవసరం మేరకు స్థానికంగా వైద్య సేవలు అందిస్తూ ఎవరూ బయటకు వెళ్లకుండా చూస్తున్నారు.

సహాయ శిబిరాల్లో 1707 మంది

జిల్లాలో ఏర్పాటుచేసిన 27 సహాయక శిబిరాల్లో రాష్ట్రేతరులు, ఇతర జిల్లాల వారు 1707 మంది ఉన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల నుంచి శుక్రవారం 86 మంది డిశ్చార్జి అయ్యారు. 25 మంది కొత్తగా చేరారు. మొత్తం 363 మంది క్వారంటైన్‌లో ఉన్నారని జేసీ - 2, కొవిడ్‌ - 19 జిల్లా నోడల్‌ అధికారి చంద్రమౌళి తెలిపారు.

కొవిడ్‌ ఆసుపత్రిలో పారిశుద్ధ్య చర్యలు

జిల్లాలోని కొవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం నగరపాలక అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇద్దరు కరోనా పాజిటివ్​ వ్యక్తులకు ఇక్కడ చికిత్స అందిస్తున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కమిషనర్​ చల్లా ఓబులేశు ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేసి.. సిబ్బందికి పీపీఈ కిట్లను అందించారు.

శ్రీపద్మావతి నిలయం పరిశీలన

శ్రీపద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పెంచలయ్య పరిశీలించారు. అక్కడే రిఫ్రిజిరేటర్‌ను ప్రారంభించి, క్వారంటైన్‌లో ఉన్న వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఇన్‌ఛార్జి డాక్టర్‌ రెడ్డెప్పను ఆరాతీశారు.

జిల్లాలో కరోనా హెల్త్​ బులెటిన్​

అనుమానితులు756
నెగిటివ్​ వచ్చినవారు554
ఫలితాలు రావాల్సినవి182
పాజిటివ్​ కేసులు20
చికిత్సలో ఉన్న పాజిటివ్​ బాధితులు19
రికవరీ అయినవారు1
క్వారంటైన్​లో ఉన్నవారు363
శుక్రవారం డిశ్చార్జి అయినవారు86

ఇదీ చూడండి:

కర్షకుల శ్రమను నిండా ముంచిన అకాల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.