కరోనా నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ భరత్ గుప్తా పర్యటించారు. కోవిడ్-19 ల్యాబ్‌ల ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి రుయా, వెటర్నరీ కళాశాల, ఐజర్ ప్రాంతాల్లో పర్యటించి కోవిడ్ ల్యాబ్‌ల ఏర్పాట్లుపను పరిశీలించారు. అనుమానితుల స్వాబ్ సేకరించిన గంటలోపే ఫలితాలు వచ్చే విధంగా జిల్లాలో పలు ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. స్విమ్స్‌లో ఇప్పటికే ఉన్న ఆర్.టి. పి.సి. నాట్ మిషన్( రియల్ టైమ్ పాలిమర్ రియాక్షన్) తో పాటు అదనంగా ట్రూనాట్ మిషన్లు.. రుయాలో 5, చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి 5, వెటర్నరీ 3, పలమనేరు 2, మదనపల్లి 2 కలిపి మొత్తం 17 ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి:గ్రామీణ ఆరోగ్య పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్