ETV Bharat / state

చంద్రగిరిలో హైడ్రామా..."చెవిరెడ్డి, పులివర్తి" అరెస్ట్ - పులివర్తి నాని

చంద్రగిరిలో పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్​ఆర్ ​కమ్మపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. వైకాపా కార్యకర్తలు డబ్బులు పంచుతున్న క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తెదేపా, వైకాపా అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

చంద్రగిరి అభ్యర్థులు చెవిరెడ్డి, పులివర్తి నాని అరెస్టు
author img

By

Published : May 17, 2019, 7:21 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ నెల 19న రీపోలింగ్ జరగనున్న అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఒకటి ఎన్​ఆర్ కమ్మపల్లి. ఇక్కడ వైకాపా శ్రేణులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు మోక్షిత్ రెడ్డి అనుచరులను వెంట పెట్టుకుని గ్రామంలోకి రావడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు ఆయనను అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇరువర్గాల బాహాబాహీ...

ఇరువైపులా మద్దతుదారులు గుమికూడటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి పులివర్తి నాని తిమ్మరపల్లి నుంచి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి సీకేపల్లి వైపు నుంచి ఎన్​ఆర్ కమ్మపల్లి గ్రామ సమీపానికి చేరుకున్నారు. వంద మీటర్ల పరిధిలో రెండు వర్గాల వారు నిలిచారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అన్భు రాజన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రెండు వర్గాలతో చర్చించారు.

రాత్రి పది గంటలు దాటక చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించే ప్రయత్నం చేశారు.దీంతో వైకాపా కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసులు గుంపును చెదరగొట్టారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రేణిగుంట పోలీసు స్టేషన్​కు తరలించారు.

తెదేపా కార్యకర్తలు వెనుదిరిగి గ్రామంలోకి వెళ్లిపోయారు. తన వాహనంలో తిరుపతికి బయల్దేరిన పులివర్తి నానిని రాయలచెరువు కట్టపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్​కు తరలించారు. అక్కడి నుంచి గాజులమండ్యం స్టేషన్​కు తీసుకెళ్లారు.

New Delhi, May 16 (ANI): Congress condemned Pragya Singh Thakur's controversial statement, calling Nathuram Godse a 'deshbhakt'. Congress' Randeep Singh Surjewala said, "India's soul is under attack by successors of Godse, the BJP ruling dispensation. BJP leaders are describing the murderer of father of the nation as a true nationalist and declaring those who sacrificed their lives for nation like Hemant Karkare as anti-nationals."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.