చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వీఆర్ఏ లు చేస్తున్న "ధర్మ పోరాట" రిలే దీక్షల్లో.. చంద్రగిరి మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి సొమ్మసిల్లి పడిపోయారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. తన న్యాయమైన సమస్యల పరిష్కారానికి రామ్మూర్తి నాలుగు రోజులుగా నిరసనలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి శిబిరం వద్దే కుప్పకూలిపోయారు. కొంతకాలంగా బీపీ, షుగర్ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తోటి ఉద్యోగులు తెలిపారు. రామ్మూర్తిని వెంటనే 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా.. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు స్పందించలేదని వీఆర్ఏ లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Urea Problems: యూరియా కోసం రైతుల ఆవేదన.. గంటలకొద్దీ పడిగాపులు