ETV Bharat / state

వైకాపా నేతల దౌర్జన్యంపై చంద్రబాబు ధ్వజం - వైకాపా నేతల దౌర్జన్యంపై చంద్రబాబు ధ్వజం

చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన వైకాపా నేతలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

chandrababu fired on ysrcp leaders
వైకాపా నేతల దౌర్జన్యంపై చంద్రబాబు ధ్వజం
author img

By

Published : Feb 9, 2021, 3:20 PM IST

చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సమయంలో దౌర్జన్యం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారులను వైకాపా నేతలు బ్లాక్‌మెయిల్‌ చేయడం దుర్మార్గమంటూ ధ్వజమెత్తారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే గెలవటం అసాధ్యమని భయంతోనే వైకాపా బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతోందని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నాశనంచేసే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పౌరులంతా నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో జగన్​కు చెక్ పెట్టాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.