మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లాల ఘనంగా నిర్వహించారు. పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలోని తేదేపా నేతలు ఘనంగా నిర్వహించారు. శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ ఆధ్వర్యంలో భిక్షాల గాలిగోపురం ఎదుట 70 కేజీల భారీ కేకును కట్ చేశారు. అనాథలకు పండ్లు, టూత్ పేస్ట్లు, సబ్బులు, వస్త్రాలను పంపిణీ చేశారు.
శాంతిపురం
శాంతిపురంలో వినూత్నంగా చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. శాసన మండలి సభ్యుడు గౌని వారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు 72 కేకులను వరుసగా ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని కట్ చేసి పంపిణీ చేశారు.
ఇదీ చదవండి