ETV Bharat / state

వైభవంగా ఎల్లమ్మ జాతర.. అలరించిన చాందిని బండ్లు - కలికిరి

చిత్తూరు జిల్లా కలికిరిలో గ్రామదేవత ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన చాందిని బండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వైభవంగా ఎల్లమ్మ జాతర.. అలరించిన చాందిని బళ్లు
author img

By

Published : Jul 22, 2019, 12:20 PM IST

వైభవంగా ఎల్లమ్మ జాతర.. అలరించిన చాందిని బళ్లు

చిత్తూరు జిల్లా కలికిరిలో గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అందులో భాగంగా నిర్వహించిన చాందిని బండ్ల ప్రదర్శన అలరించింది. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన బండ్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆనందపరవశుల్ని చేశాయి. పిల్లనగ్రోవి, చెక్క భజనలు, కోలాటాలు, పండరి భజనలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవీ చదవండి..

కరవు పొమ్మంటోంది.... పల్లె కన్నీరు పెడుతోంది....

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ లో ఏటీఎం కొరత చాలా అధికంగా ఉంటుందని దానిని అధిగమించడానికి నేడు గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ ప్రాంగణంలో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటీఎం మిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఏటీఎం మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్కామాణిక్యవరప్రసాద్ , రామకృష్ణ , బ్యాంక్ చైర్మన్ వెంకటసుబ్బయ్య హాజరయ్యారు. ప్రయాణికులు సేవలు అందించేందుకు జిడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏటీఎం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నోట్లు రద్దు సమయంలో కూడా తమ బ్యాంక్, ఏటీఎం ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించామని చెప్పారు. జిల్లాలో మొత్తం 82 ఏటీఎం లు మిషన్లు ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. తమ బ్యాంక్ రైతులకు వివిధ లోన్లు అందించడంలోను ఎప్పడు ముందు ఉంటుందని వివరించారు.

Body:బైట్...ఎం.వెంకట సుబ్బయ్య....జిడిసిసి బ్యాంక్ చైర్మన్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.